తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ మేరకు మంగళవారం ఉదయం 10.30గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి మీడియా సమావేశం నిర్వహించనుండగా.. ఈ సందర్భంగా ఆయన నోటిఫికేషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది.