బీజేపీ నేత, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పటాన్ చెరువులోని హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. తనను లైంగిక వేధించిన రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది.
గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతోంది. అంతకు ముందు ఆమె సెల్ఫీ వీడియోను తీసుకుంది. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది.
అంతే కాదు తనకు ప్రాణహాని కూడా ఉందని ఆమె అప్పట్లో చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. అయితే ఆమె ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. అత్యాచారం కేసులో తనకు న్యాయం చేయడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.