Home / MOVIES / రూల్స్ బ్రేక్ చేసిన సమంత

రూల్స్ బ్రేక్ చేసిన సమంత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సృజనాత్మకతకు, కొత్త ఆలోచనా విధానానికి డిజిటల్ వేదికలు కొత్త రెక్కలనిచ్చాయని టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత వ్యాఖ్యానించింది. `ది ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్‌తో సమంత డిజిటల్ అరంగేట్రం చేయబోతోంది.

ఈ సిరీస్ తొలి సీజన్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న రెండో సీజన్‌లో సమంత కూడా కనిపించనుంది. పూర్తి నెగిటివ్ క్యారెక్టర్లో తీవ్రవాదిగా కనిపించనుంది. దీని గురించి తాజాగా సమంత ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడింది.

`ఇప్పటివరకు ఉన్న రూల్స్‌ను బ్రేక్ చేసే అవకాశాన్ని మాకు ఓటీటీ కల్పించింది. `ఫ్యామిలీ మేన్-2`లో నేను సరికొత్తగా కనిపించబోతున్నాను. నన్ను చూసి అందరూ షాకవుతారు. ఈ సిరీస్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన`ని సమంత పేర్కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat