కరోనా లాక్‌డౌన్ సమయంలో తమిళం నేర్చుకున్నానని ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా తెలిపింది. ప్రస్తుతం చెన్నైలో ఓ తమిళ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న రాశీఖన్నా దీపావళి వేడుకలను ముంబాయిలోని తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోలేకపోయింది.
అదే సమయంలో సినీ యూనిట్‌తో కలిసి చెన్నైలోనే ఆమె దీపావళి జరుపుకుంది. ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ తమిళంలో తనకు విజయ్ నటన, డాన్సులన్నా చాలా ఇష్టమని, ఆయనతో నటించాలని ఆశపడుతున్నానని తెలిపింది.
తమిళంలో ఓ చారిత్రక చిత్రంలో నటించాలని అనుకుంటున్నానని రాశి చెప్పింది. ఇక కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు లేక ఇంటి దగ్గర ఉన్న సమయంలో చక్కగా తమిళం నేర్చుకున్నానని, ప్రస్తుతం సులువుగా తమిళంలో మాట్లాడగలుగుతున్నానని రాశీఖన్నా పేర్కొంది