సిద్ధిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాల నిర్మాణాలకు ₹14 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలలను మంజూరు చేసుకున్నామని చెప్పారు.16 పాఠశాలలకు స్వంత భవనాలు ఉన్నాయ్..
6 పాఠశాలలకు స్వంత భవనాలు లేక విద్యార్థులకు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని 6 ఇంటిలో నాలుగు కొత్తగా పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు.. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం తొగుట , రాయ్ పోల్ మండలాల్లో , హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కనపేట మండలంలో, జనగామ నియోజకవర్గం చెందిన కోమరవేల్లి మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల భవనాలకు , ఒక్కో భవనానికి ₹3 కోట్ల 50లక్షల చొప్పున మొత్తంగా ₹14 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.. త్వరలోనే పనులు ప్రారంభం చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు..
– అధునాతన హంగులతో.. కార్పోరేట్ స్థాయి విద్య…
పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ తరహలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ..అదే తరహాలో బోధన ను అందించే దిశగా కృషి చేస్తోంది.. ప్రస్తుతం మంజూరు అయిన కస్తూర్భా గాంధీ పాఠశాలల భవనాలు అధునాతన హంగులతో నిర్మాణం చేపట్టనున్నారు.. ప్రతి పాఠశాలలలో ప్రత్యేకంగా లైబ్రరీ , మోడెల్ డైనింగ్ హాల్ , మోడల్ వసతి గృహాలు , ల్యాబ్, స్టడీ రూమ్స్ ఇతర మౌలిక సదుపాయాలతో భవనాలు ఏర్పాటు కానున్నాయి..అదే దిశగా విద్యా బోధన ఉంటుంది..