టాలీవుడ్ కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లూ దంపతులు పెళ్లయినప్పటి నుంచి తమకు సంబంధించిన అప్ డేట్స్‌ను ఎప్పటికపుడు తమ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే కార్వా చౌత్ వేడుకల్లో పాల్గొన్న ఈ కపుల్..ఆ తర్వాత ఫొటోషూట్ లో కూడా పాల్గొన్నది. తాజాగా కాజల్-గౌతమ్ కపుల్ హనీమూన్ కు వెళ్లారు. ఇంతకీ ఈ జంట ఎంపిక చేసుకున్న హనీమూన్ లొకేషన్ ఏంటో తెలుసా..? సెలబ్రిటీలందరి ఫేవరెట్ టూరిజం స్పాట్ మాల్దీవులు.
తన భర్త గౌతమ్ తో కలిసి అందమైన రిసార్ట్స్ లో విహరిస్తోంది. ప్రతీ విషయంలో నా భాగస్వామి గౌతమ్ కిచ్లూ అనే క్యాప్షన్ తో మాల్దీవులు వెకేషన్ ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాజల్ మినీ డ్రెస్ లో సముద్ర అందాలను ఆస్వాదించింది. వేకువ జామునే ఆసనాలు కూడా వేసింది. కాజల్-గౌతమ్ హీరోహీరోయిన్ల మాదిరిగా రొమాంటిక్ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.