హైదరాబాద్‌లోని పేదలకు మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే 199 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది..ఈ రోజు గురువారం నుండి మరో 24 అందుబాటులోకి రానున్నాయి.
వాటిని ఉపసభాపతి పద్మారావుతోపాటు.. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు.
కొత్తగా కాచిగూడ, పార్శీగుట్ట, కుత్బుల్లాపూర్, గూలిపూర, మలక్‌పేట్, కవాడిగూడ పరిధిలో ప్రారంభంకానున్నాయి. దూల్‌పేట్, ఎర్రగడ్డ, నేరెడ్‌మెట్, మల్కాజిగిరి, సరూర్‌నగర్, కార్వాన్‌లోనూ బస్తీదవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి.