దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఆశించిన విధంగా ఫలితాలు ఎందుకు రాలేదనే విషయంపై త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు.
సమీక్ష అనంతరం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామన్నారు. దుబ్బాక ఫలితంతో అప్రమత్తం అవుతామన్నారు. తాము విజయాలకు పొంగిపోము, ఓటమికి కుంగిపోమన్నారు.