తెలంగాణలో ఈ రోజు విడుదలవుతున్నదుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కచ్చితంగా దుబ్బాక టీఆర్ఎస్‌దేనని అధిష్టానం, స్థానిక నేతలు భావించారు. అంతేకాదు.. మంత్రి హరీష్ రావు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా దగ్గరుండి మరీ చూసుకున్నారు.
అయితే ఫలితాలకు వచ్చేసరికి పూర్తిగా తారుమారైంది. ఒక్క పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో తప్ప టీఆర్ఎస్.. రౌండ్లలో మాత్రం ఎక్కడా ఆధిక్యత చూపలేదు. ఇప్పటి వరకూ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఈ ఐదు రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావే ఆధిక్యంలోనే ఉన్నారు.
మొదటి, రెండవ, మూడవ, నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం చూపడంతో ‘దుబ్బాక మనదే’ అన్నట్లుగా రాష్ట్ర కమలనాథులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఐదవ రౌండ్ ఫలితాలు కూడా వచ్చేసే సరికి కమలనాథులకు పూర్తిగా ధీమా వచ్చేసింది. మరోవైపు బీజేపీ పెద్దలు కొందరు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.