దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ ఆరు రౌండ్ల పూర్తయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగగా.. ఆరు రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే 2,667 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థే కొనసాగుతున్నారు. దుబ్బాకలో ఇప్పటి వరకూ 45,175 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది.
ఆరో రౌండ్ ఫలితాలు ఇలా..
బీజేపీ అభ్యర్థి రఘునందన్ : 20,226 ఓట్లు
టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత : 17,559 ఓట్లు
కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి : 3,254 ఓట్లు.