తెలంగాణలో కొత్తగా 857 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,51,188కి చేరింది ఇందులో 19,239 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటివరకు 2,30,568 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నలుగురు మృతిచెందగా.. కరోనా మృతుల సంఖ్య 1,381కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 250 కేసులు వచ్చాయి.