తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ టీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆయన ఈసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ కార్యాలయ భవనం కోసం 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ స్థలాన్ని చదును చేసే పనులు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
భవన నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈ నెల 10, 11వ తేదీల్లో లేదంటే దీపావళి పండుగతో మొదలయ్యే కార్తీక మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయని ఆయనకు వేద పండితులు చెప్పినట్లు తెలుస్తోంది.
Post Views: 215