ఎందుకో తెలియదు కానీ మోనాల్ గజ్జర్ నామినేషన్స్‌లోకి వచ్చిన ప్రతీసారి సేవ్ అవుతూనే ఉంది. ఓట్ల పరంగా ఆమెకు తక్కువగానే వస్తున్నాయనే విమర్శలు వచ్చినా కూడా మోనాల్ మాత్రం సేవ్ అవుతుంది. అదెలా అంటే ఆమెకు బిగ్ బాస్ సపోర్ట్ బిగ్ రేంజ్ లో ఉందంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి. మూడు వారాల కింద కుమార్ సాయిని కూడా కేవలం మోనాల్ కోసమే ఎలిమినేట్ చేసారంటూ రచ్చ చేసారు ఫ్యాన్స్. ఓట్లు వేయడం ఎందుకు అంటూ విమర్శలు వస్తే.. ఇక్కడ అంతా ఓటింగ్ ప్రకారమే జరుగుతుంది కానీ బిగ్ బాస్ కు నచ్చినట్లు కాదంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం మరోసారి నామినేషన్ నుంచి మోనాల్ ను సేవ్ చేసాడు బిగ్ బాస్. అదెలా అంటే.. అభిజీత్, అవినాష్, హారిక, అమ్మతో కలిసి ఈ వారం నామినేషన్స్ లో ఉంది మోనాల్. అయితే మొన్న వాళ్లను సేవ్ చేయడానికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
అందులో అభిజీత్, హారిక ఓడిపోయారు. ముఖ్యంగా అభిజీత్ అయితే తనకు తానుగా బయటికి వచ్చాడు. హారిక ఓడిపోయింది.. మిగిలింది ముగ్గురు అవినాష్, మోనాల్, అమ్మ రాజశేఖర్. అయితే మళ్లీ వాళ్ల ముగ్గురిలో అమ్మను బిగ్ బాస్ పక్కనబెట్టాడు. మిగిలిన ఇద్దరికి సేవ్ అయ్యే అవకాశం కల్పించాడు. మోనాల్, అవినాష్ ఇంట్లో ఉండాలా లేదా నామినేషన్స్‌లోనే ఉండాలా అని తేల్చే అవకాశం ఇంటి సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. రెండు బుట్టలు తెప్పించిన బిగ్ బాస్.. వాళ్లలో ఎవరికి సపోర్ట్ చేయాలంటే వాళ్ల బుట్టను తమకు యిష్టమైన వస్తువులతో నింపాలని సూచించాడు. అవి మళ్లీ తిరిగి రావని చెప్పాడు.
దాంతో ఇంట్లో ఉన్న వాళ్లు ఒక్కొక్కరుగా ఆ బుట్టలను నింపడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మోనాల్ ఈజీగా సేవ్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే మోనాల్‌కు అఖిల్, అభిజీత్, హారిక, అమ్మ రాజశేఖర్ సపోర్ట్ ఉంది. మరోవైపు అవినాష్‌కు అరియానా, సోహైల్, మెహబూబ్ ఉన్నారు. అఖిల్ అయితే మోనాల్ కోసం తన బట్టలను కూడా త్యాగం చేసాడు. ఇంకా వేరే వస్తువులు కూడా తీసుకొచ్చి అందులో వేసాడు. మోనాల్ బుట్ట ఈజీగా నిండిపోయింది. అవినాష్‌ది మాత్రం అలాగే ఉండిపోయింది. ఎలా చూసుకున్నా కూడా ఇది మోనాల్ ను సేవ్ చేయడానికి బిగ్ బాస్ ఆడిన గేమ్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
Tags akkineni big boss film nagar film news maa tv monal gajjar movies nagarjuna slider Telugu Movies tollywood