Home / MOVIES / మలేరియా బారిన పడిన టాలీవుడ్ నటి

మలేరియా బారిన పడిన టాలీవుడ్ నటి

తాను కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటి కృతి కర్బందా తన అభిమానులకు తెలిపారు. తనపై అనంతమైన ప్రేమ కురిపిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటున్నందుకు శ్రేయోలాభిషులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. 2020 తనకు ఎన్నో విషయాలు నేర్పిందంటూ సోషల్‌ మీడియాలో ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు.

కాగా కృతి కర్బందా ఇటీవల మలేరియా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేస్తూ తనకు బోర్‌ కొట్టకుండా చూడాలంటూ ఫాలోవర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు.. ‘‘ ఇది నా మలేరియా వాలా ఫేస్‌. ఈ ప్రపంచానికి హాయ్‌ చెబుతోంది. అయితే మరెంతో కాలం దీనిని భరించేందుకు నేను సిద్ధంగా లేను. షూట్‌కి వెళ్లాలి కదా అందుకే త్వరలోనే దీనికి బై చెబుతాను. నా గురించి ఆందోళన చెందిన వారికి కోసం ఈ పోస్టు. నేను బాగున్నా. రేపటి వరకు నా ఆరోగ్యం మరింత కుదుటపడుతుందని భావిస్తున్నా.

కాస్త అనారోగ్యంగా అనిపిస్తున్నా.. పర్లేదు. తట్టుకోగలను. ఓపికతో పాటు నన్ను ప్రేమించుకోవడం ఎలాగో ఈ ఏడాది నాకు నేర్పిన పాఠం. నాపై ప్రేమ కురిపిస్తున్నందుకు థాంక్యూ’’అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన కృతి… బోణీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన మేర విజయం సాధించకపోవడంతో అడపాదడపా తెలుగులో అవకాశాలు వచ్చినా ఆమె కెరీర్‌కు ప్లస్‌ కాలేదు. దీంతో సాండల్‌వుడ్‌పై దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మ..

ఆ తర్వాత బీ-టౌన్‌లో అడుగుపెట్టి అక్షయ్ కుమార్‌ హౌజ్‌ఫుల్‌ 4 సినిమాతో కెరీర్‌లో తొలిసారి భారీ హిట్‌ అందుకుంది. అదే జోష్‌లో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. అక్టోబరు 29న 30వ వసంతంలోకి అడుగుపెట్టిన కృతి.. ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్‌ ప్రేమలో మునిగితేలుతోంది. వీరే దీ వెడ్డింగ్‌ సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఈ జంట.. తర్వాత పాగల్‌పంతీ మూవీలో హీరోహీరోయిన్లుగా అవకాశం దక్కించుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat