తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇండ్ల పథకానికి మరోసారి విశిష్ఠ గుర్తింపు లభించింది.
కొల్లూరు-2లో నిర్మించిన రెండు పడకల ఇండ్ల కాలనీకి పట్టణ నిరుపేద గృహాలు, మౌలిక వసతుల పథకం కింద జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు లభించింది.
శుక్రవారం హైదరాబాద్‌లో హడ్కో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం సంయుక్త జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్) మురళీకృష్ణ ఈ అవార్డును జీహెచ్ఎంసీ హౌసింగ్ విభాగం ఓఎస్డీ సురేశ్‌కుమార్‌కు అందజేశారు. అవార్డుతోపాటు రూ.లక్ష నగదు పురస్కారాన్ని కూడా అందించారు.