తెలంగాణ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా ఎన్.శంకర్, వంశీకృష్ణ, సురేందర్‌రెడ్డి నియామకమయ్యారు.
తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా జీ శ్రీనివాస్‌రెడ్డి, నార్సింగి మున్సిపల్ కమిషనర్‌గా సత్యబాబు, కొల్లాపూర్‌కు విక్రమసింహారెడ్డి, దేవరకొండకు వెంకటయ్య, భువనగిరికి పూర్ణచందర్‌రావు, జనగామకు సమ్మయ్య, నేరేడుచర్లకు గోపయ్య, తిరుమలగిరికి డీ శ్రీనివాస్, జహీరాబాద్‌కు సుభాష్‌రావు, నర్సాపూర్‌కు అశ్రిత్‌కుమార్, చేర్యాలకు రాజేంద్రకుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సీడీఎంఏ కార్యాలయానికి గీతారాధికను బదిలీ చేసింది.