తెలంగాణ రాష్ట్రంలోనిమంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్ రిపోర్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు.
ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.