దుబ్బాక ఉప ఎన్నికలో ఇప్పటికే రెండు సార్లు ఫీల్డ్ సర్వే చేసిన సీపీఎస్ టీమ్…పోలింగ్ రోజు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇందులో టీఆర్ఎస్ 47.4% బీజేపీ 35.3% కాంగ్రెస్ 14.7% శాతం, ఇతరులు 2.6% ఓట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని సీపీఎస్ టీమ్ అంచనా వేసింది.
మొత్తం 23 మంది అభ్యర్ధులున్నప్పటికీ, మిగిలిన వారి ప్రభావం తక్కువగా ఉంటుందని తేల్చారు. మెజార్టీ కూడా 19600 నుంచి 22000 మధ్య వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దాదాపు 15 సంవత్సరాల నుంచి సర్వేల్లో విశిష్ట అనుభవం ఉన్న సీపీఎస్ టీమ్….ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో ఇచ్చిన అంచనాలు దాదాపు ఫలితాల్లో ప్రతిబింబించాయి.
సార్వత్రిక ఎన్నికలు, జీహెచ్‌ఎమ్‌సీ వంటి పట్టణ ఓటర్లు కలిగిన ఎన్నికల్లో సర్వేలు చేసిన అనుభవమే కాకుండా, నారాయణఖేడ్, పాలేరు, నంద్యాల, హుజూర్ నగర్ వంటి ఉప ఎన్నికల సమయంలో కూడా సీపీఎస్ టీమ్ ఇచ్చిన అంచనాలు అచ్చుగుద్దినట్లు ఫలితాల్లో కనిపించాయి.