ప్లే ఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ సత్తా చాటింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ లో ఓపెనర్లు వార్నర్ (85*), వృద్ధిమాన్ సాహా (58*) మెరుగ్గా ఆడారు. దీంతో 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరి ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకుంది.
అంతకుముందు టాప్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్.. 20 ఓవర్లలో 149/8 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్ గెలుపుతో ఈ సీజన్లో KKR కథ ముగిసింది