తెలంగాణ రాష్ట్రంలోని త్వరలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు ప్రస్తుతం యువత నిరుద్యోగంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
నిరుద్యోగ భృతి ఇద్దామనుకునే సమయానికి కరోనా వచ్చిందన్నారు. అటు యువత సైతం వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారని, ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నవారే ఇప్పుడు పండుగ అంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు