బాలీవుడ్ హీరోయిన్, `సాహో` భామ శ్రద్ధా కపూర్ రోజురోజుకూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శ్రద్ధా హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధ మరో మైలురాయిని చేరుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన మూడో ఇండియన్ సెలబ్రిటీగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధను 56.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న శ్రద్ధ.. తాజాగా హీరోయిన్ దీపికా పదుకొనేను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది.
ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 82.2 మిలియన్ల ఫాలోవర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక, విరాట్ తర్వాతి స్థానంలో ప్రియాంకా చోప్రా (58.1 మిలియన్లు) ఉంది. ప్రియాంక తర్వాతి స్థానంలో దీపిక (52.3 మిలియన్లు) ఇప్పటివరకు మూడో స్థానంలో ఉండేది. తాజాగా శ్రద్ధ ఆమెను దాటేసి 56.4 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది.