దేశంలో గత 24 గంటల్లో కొత్త 38,310 మందికి కోవిడ్ సంక్రమించింది. దీంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623కి పెరిగింది. గత 24
గంటల్లోనే దేశంలో 490 మంది మరణించారు.
దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,23,097కి చేరింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,41,405కి చేరుకున్నట్లు కేంద్ర
ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 76,03,121కి చేరుకున్నది. గత 24 గంటల్లో కొత్తగా 58,323 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.