ప‌్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు జ్యోతి ప్రజల్వన చేశారు. జ్వాలా గుత్తా అకాడమీని రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఏర్పాటు చేశారు. అద్భుతమైన సౌకర్యాలతో అకాడమీని ఏర్పాటు చేసిన జ్వాలా గుత్తాకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎందరో యంగ్ షట్లర్లకు జ్వాలా ప్రేరణగా నిలుస్తుందన్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ద్వారా ఎందరో ఛాంపియన్ ప్లేయర్స్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నూతన క్రీడా పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని చెప్పారు.
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టం క్రీడల్లోనూ నంబర్ వన్ ప్లేస్‌లో నిలవాలి. జ్వాలా అకాడమీకి క్రీడా శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
https://twitter.com/MinisterKTR/status/1323219139582849025?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1323219139582849025%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsports%2Fminister-ktr-formally-launched-the-jwala-gutta-academy-of-excellence-96189