సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ అన్నారు. కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని వ్యవసాయ భూములను సైతం సాదాబైనామా ద్వారా ఉచితంగా క్రమబద్దీకరించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు కృజ్ఞతలు తెలుపుతూ.. హన్మకొండ ప్రశాంత్ నగర్‌లోని ఎమ్మెల్యే నివాసం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాన్యుడికి భారం కొవొద్దనే సీఎం కేసీఆర్ విలీన గ్రామాల రైతులకు ఉచితంగా సాదాబైనామా చేసుకునే అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో విలీన గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.