తెలంగాణలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య నేడు బాగా తగ్గాయి. తాజాగా తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 922 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తంగా కరోనా పాజిటివ్ కేసులు 2,40,970కి చేరుకున్నాయి.
రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకూ 1,348 మంది మృతి చెందారు. తెలంగాణలో 17,630 యాక్టివ్ కేసులున్నాయి. 2.20 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 256, రంగారెడ్డి 56, మేడ్చల్‌లో 40 కేసులు నమోదు అయ్యాయి