హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోయింది. గౌతమ్ కిచ్లూతో ఆమె వివాహం పూర్తయింది. ప్రేమ వ్యవహారం బయటికి వచ్చి నెల కూడా కాకుండానే పెళ్లిని ముగించేసింది కాజల్ అగర్వాల్.
చాలా కాలం నుంచి పెళ్లి అనే వార్తలను ఖండిస్తూ వచ్చిన కాజల్.. చివరికి తన ప్రేమని, ప్రియుడిని తెలియజేసింది. అంతే.. అప్పటి నుంచి నిత్యం కాజల్ వార్తలలో నిలుస్తూనే ఉంది.
అక్టోబర్ 30 శుక్రవారం ఆమె తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడింది. కాజల్ పెళ్లి పూర్తయినట్లుగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫొటో చూసి కాజల్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అయితే పెళ్లికి ముందు జరిగిన ఫంక్షన్లలో ఎంతో సంతోషంగా కనిపించిన కాజల్.. పెళ్లి కాసేపట్లో అని తెలిసి.. నిశ్శబ్దానికి లోనైనట్లుగా ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు భర్త పక్కన మాత్రం చాలా కూల్‌గా, సంతోషంగా కాజల్ ఈ ఫొటోలో కనిపిస్తోంది.