ఫార్మారంగంలో తెలంగాణ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకొనే దిశగా ముందుకు వెళ్తున్నది. తాజాగా రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో విస్తరించడానికి ముందుకొచ్చాయి. మంగళవారం ప్రగతిభవన్‌లో గ్రాన్యూల్స్ ఇండి యా, లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు.
అనంతరం తాము హైదరాబాద్‌లో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్న ట్టు వెల్లడించారు. ఈ రెండు కంపెనీల ప్రతినిధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన గ్రాన్యూల్స్ ఇండియా మంగళవారం రూ.400 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది.
దాదాపు 10 బిలియన్ ఫినిష్డ్ డోసులను తయారుచేసే సామర్థ్యం ఈ ఫార్మా కంపెనీకి ఉన్న ది. దీని ద్వారా 1600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటి మంత్రి కేటీఆర్‌కు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా 75 దేశా ల్లో గ్రాన్యూల్స్ ఇండియా విస్తరించి ఉన్నది. కాగా, 8 ప్రాం తాల్లో తయారీ యూనిట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నా రు. ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ ఇంటర్మీడియట్ యూనిట్‌ను హైదరాబాద్ దగ్గరలోని గాగిల్లాపూర్‌లో ఏర్పాటుచేసింది.