కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇపుడు సెలబ్రిటీల్లో చాలా మంది ఫేవరెట్ టూరిజం డిస్టినేషన్ గా గోవాను ఎంచుకుంటునున్నారు.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషల నటీనటులు రిలాక్స్ అయ్యేందుకు గోవా వెళ్తున్నారు. టాలీవుడ్ నటి సురేఖావాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీనియర్ గోవా ట్రిప్ కు వెళ్లింది.
గోవా లొకేషన్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసింది. ఎరుపు రంగు డ్రెస్సులో సురేఖావాణి కనిపిస్తుండగా..టేబుల్ క్యాండిల్ వెలుగుతుంది. దాని పక్కనే వైన్ గ్లాస్ కూడా కనిపిస్తుంది.
సాధారణంగా సెలబ్రిటీలు ఆల్కాహాల్ కు సంబంధించిన సోషల్ మీడియాలో పెట్టరు. కానీ సురేఖావాణి ట్రోల్స్ తో సంబంధం లేకుండా వైన్ బాటిల్ పెట్టింది.