కసౌటీ జిందగీ కే సీరియల్ తో పాపులర్ అయింది నటి శ్వేతాతివారి. ఆ తర్వాత పలు టీవీ సీరియళ్లు, టీవీ షోల్లో కనిపిస్తూ తనకంటూ ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకుంది.
తన అందం, అభియనంతో ఆకట్టుకునే ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది. హిందీ, పంజాబీ, మరాఠీ, భోజ్‌పురి, కన్నడ, ఉర్ధూ భాషల్లో నటించింది. ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకున్న శ్వేతా తివారి..40వ బర్త్ డే కూడా జరుపుకుంది.
ఈ భామ చిన్న బ్రేక్ తీసుకుంది. ముంబై ఔటర్ ప్రాంతంలోని రిసార్టులో ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపింది. స్విమ్ వేర్ లో శ్వేతాతివారి సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేసింది. హాల్టర్ నెక్ బికినీ టాప్, పింక్ మినీ స్కర్ట్ లో సన్ గ్లాసెస్ పెట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది.
నాలుగు పదుల వయస్సులోనూ స్లైలిష్ లుక్ లో తన అందచందాలతో కండ్లు పక్కకు తిప్పుకోకుండా చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.