ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,422 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 3,746 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.
దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,93,299కి చేరుకుంది. రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తూ ర్పుగోదావరి జిల్లాలో 677, కృష్ణాలో 503, చిత్తూరులో 437 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 4,739 మంది కరోనా నుంచి కోలుకోగా రికవరీల సంఖ్య 7,54,415కి పెరిగింది.
ప్రస్తుతం 32,376 మంది చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం వరకు రాష్ట్రంలో 72,71,050 శాంపిల్స్ పరీక్షించారు. గత 24 గంటల్లో రా ష్ట్రంలో 27 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 6,508కి పెరిగాయి.
కృష్ణా జిల్లాలో ఐదుగురు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో ముగ్గురేసి చొప్పున, కడప, శ్రీకాకుళం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలో ఒకొక్కరు చొప్పున మరణించారు.