ఎన్టీఆర్, సమంత కలయికలో వచ్చిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ఐదోసారి జోడీకట్టబోతున్నట్లు తెలిసింది. ‘అరవింద సమేత వీర రాఘవ సమేత’ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసింది.
హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందనున్న ఈ చిత్రంలో కథానాయికగా సమంత పేరును చిత్రబృందం పరిశీలిస్తోన్నట్లు తెలిసింది. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రధాన ఘట్టాలన్నీ అక్కడే చిత్రీకరించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రీకరణలో ఉన్నారు.ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ చిత్రంలో ఆయన భాగం కాబోతున్నట్లు సమాచారం.