దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారు?.. రైతులకు కరెంట్ ఇవ్వక మోసం చేసినందుకా.. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కోర్టులో కేసులు వేసినందుకా?.. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చినందుకా?.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రూపాయి ఇవ్వనందుకా?’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి?.. మీ మాటలు కాయకొరుకుడు మాటలు.. మీ నాయకులకు మీ మీదే విశ్వాసం లేదు.. ఇక ప్రజలకు విశ్వాసం ఎలా ఉంటుంది’ అని అన్నారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సొంత మండలమైన సిద్దిపేట జిల్లా తొగుట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్‌తోపాటు 100 మంది కాంగ్రెస్, బీజేపీల నుంచి మంగళవారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికలో తొగుట మండలం అద్భుత మెజార్టీ ఇస్తుందన్న సంపూర్ణ విశ్వాసం ఉన్నదన్నారు. టీఆర్‌ఎస్‌కు విశ్వాసం, విశ్వసనీయత ఉన్నదని చెప్పారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి కాంగ్రెస్ వాళ్లు కేసులు వేయడమే కారణమని ఆరోపించారు. కొండపోచమ్మ, రంగనాయకసాగర్ భూనిర్వాసితులకు పరిహారం ఎలా అందిందో మల్లన్నసాగర్ బాధితులకు కూడా అదేవిధంగా ఇస్తామన్నారు.
దుబ్బాకను సోలిపేట రామలింగారెడ్డి అన్నివిధాలా అభివృద్ధి చేశారన్నారు. రూ.800 కోట్లు వెచ్చించి మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చామనీ, రూ.101 కోట్లతో నాణ్యమైన కరెంట్‌ను ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధ తో అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రూపాయి ఇవ్వలేదనీ.. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ఏ రకంగా చనిపోయినా రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నదన్నారు. హుజూర్‌నగర్‌లో ఓట్ల కోసం అక్కడికి కేసీఆర్ పోకున్నా.. టీఆర్‌ఎస్ గెలిచాక రూ.300 కోట్ల అభివృద్ధి చేశారన్నారు.
తెలంగాణ వచ్చాక జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ గెలిచిందనీ, దుబ్బాక కూడా అంతకు డబుల్ మెజార్టీతో గెలుస్తుందన్నారు. తొగుట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని, సోలిపేట సుజాతక్కను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.