భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు రూ.550 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో భరోసా దక్కిందని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తంచేశారు. వరదలతో ప్రజలు అవస్థ పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టడంపై హైదరాబాద్‌వాసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.