అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారక రామారావు పరామర్శించారు.
సోమవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి వెళ్లి నాయినిని పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందించాలని కేటీఆర్ డాక్టర్లను కోరారు.