యువహీరో నిఖిల్ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ‘18 పేజీస్’ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా ఎంపికయ్యారు.
త్వరలో అనుపమ షూటింగ్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘కథ విని ఎగ్జైట్ అయ్యి అనుపమా ఈ సినిమా అంగీకరించారు. హీరోహీరోయిన్ల జోడీ ఆన్ స్ర్కీన్ అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రలు ఆడియన్స్‌కి గుర్తుండిపోయేలా తెరకెక్కిస్తాం’’ అని చెప్పారు. సుకుమార్ కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.