తెలంగాణ రాష్ట్రంలో గురువారం రాత్రి ఎనిమిది గంటల వరకు మొత్తం 43,916నమూనాలను పరీక్షించగా 1,554మందికి కరోనా పాజిటీవ్ అని నిర్థారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 2,19,224కి చేరింది.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అయితే గురువారం ఒక్కరోజే కరోనా చికిత్స పొందుతూ ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1256కి చేరింది.
కరోనా నుండి 1435మంది కోలుకోవడంతో మొత్తం సంఖ్య 1,94,653కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 23,203.