హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో అరుదైన అవకాశం దక్కింది. పార్లమెంటరీ ఫ్రెండ్ షిప్ గ్రూప్ పేరిట ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివిధ దేశాలకు మన పార్లమెంట్ సభ్యులను ప్రతినిధులుగా నియమించి నవశకానికి నాంది పలికింది.అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఇరవైమందికి 14 దేశాలకు ప్రతినిధులుగా నియమించారు.ఒక దేశానికి కనీసంగా ఒకరు లేదా ముగ్గురు కూడా నియమితులవగా అందులో మన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఇటలీ దేశపు పార్లమెంటరీ ఫ్రెండ్ షిప్ చూసే బాధ్యతలుచూసే అవకాశం దక్కింది.
ఈయనతో పాటు ఇద్దరు ఎంపీలు గొట్టేటి మాధవి..మార్గాని భరత్ రామ్ లు ఎంపిక కావడం విశేషం.వీరు ప్రధానంగా కేటాయించిన దేశాలు పర్యటించి విధానాల అమలులో సారూప్యతను పరిశీలించి మనకంటే మెరుగుగా ఉన్న విధానాలను అమలు పరిచేలా నివేదికలు ఇస్తారు.ఆయా దేశాల సమావేశాలకు, వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. సాంస్కృతికం, సాంకేతికం…పారిశ్రామికం, విద్య, వైద్య రంగాలను ఆకళింపు చేసుకోవడంలో ఆయా దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహపూర్వక ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈ పార్లమెంటరీ ఫ్రెడ్ షిప్ గ్రూప్ లక్ష్యంగా ఉంటుంది…ఈ సందర్భంగా ఎంపీ గోరంట్ల మాధవ్ గారు తనకొచ్చిన ఈ అవకాశాన్ని సోదర సభ్యులతో కల్సి దేశ పురోగతికి ఉపకరించే దిశగా విశదీకరించి నివేదికలు తయారు చేస్తామన్నారు.గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించిన ఈ ఎంపీ అవకాశంతో పార్టీ, ప్రభుత్వ ఖ్యాతిని ఇనుమడింప చేసేందుకు కృషి చేస్తామన్నారు…