తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరంలో వరదలో చిక్కుకున్న హబ్సీగూడ, రామంతాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా హబ్సీగూడ, రామంతాపూర్ ప్రాంతాల్లో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించారు.
పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే సహాయక చర్యల్లో పాల్గొనాలని స్థానిక ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డితో పాటు కార్పొరేటర్‌కు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరూ ఆందోళనకు గురి కావొద్దని, వరద బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రుల వెంట పోలీస్, రెవెన్యూ, బల్దియా అధికారులున్నారు.