హైదరాబాద్ నగర శివార్లలోని గగన్‌పహాడ్ వద్ద జాతీయరహదారిపై వరద బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వానలతో గగన్‌పహడ్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురయ్యింది.
అప్ప చెరువు తెగడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చింది. దీంతో 44వ జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమయ్యాంది. వరద ఉధృతికి బస్సులు, కార్లు, లారీలు కొట్టుకుపోయాయి. ఈఘటనలో 30 కార్లు, 30 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీశారు
రోడ్డు కోతకు గురైన ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరీశించారు. సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిని మూసివేసి ట్రాఫిక్‌ను జౌటర్ రింగ్‌రోడ్డుకు మళ్లించారు.
నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, కర్నూలు, బెంగళురు వైపు వెళ్లేవారు పీవీ ఎక్స్‌ప్రెస్ వై, జాతీయ రహదారి గుండా కాకుండా ఔటర్ రింగ్ రోడ్డునుంచి వెళ్లాలని సూచించారు. పీవీఎక్స్‌ప్రెస్ వేను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు.