దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు.
దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంది.
నవంబరు 3న పోలింగ్, 10న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో ఉండనున్న సంగతి తెలిసిందే. నేడోరేపో వీరు సైతం నామినేషన్లు దాఖలు చేయనున్నారు