Home / SLIDER / దుబ్బాకలో బీజేపీకి షాక్

దుబ్బాకలో బీజేపీకి షాక్

రాయపోల్ మండల్ కేంద్రంలో మంత్రి హరీశ్ రావు గారి ఆధ్వర్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బీజేపీ జిల్లా మహిళ మోర్చా నాయకులు బాల్ లక్ష్మీ చిత్త రమణి మరియు మిగత మహిళ నాయకురాలు దౌల్తాబాద్ మండలముకి చెందింటువంటి 300 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఈరోజు తెరాస లో చేరడం జరిగింది..

– ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మీ ముందుకు ఆయన సతీమణి సోలిపేట సుజాతమ్మ గారు పుట్టెడు దుఃఖంతో మీ ముందుకు వస్తూ ఆయన ఆశయాలు సాధించే క్రమంలో తాను తెరాస అభ్యర్థుగా మీ దగ్గరికి వస్తుంది..మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇయ్యలని కోరుతున్నాము.. సుజాతమ్మ గారికి నేను మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తోడుగా ఉంటాము .రాయపోల్ మంచిగా అభివృద్ధి చేసుకుందాము అని అన్నారు..ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెరాస లో చేరుతున్న అందరికి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు వారు అన్నారు..అందరు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని మంచి మెజార్టీతో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతమ్మ గారిని గెలిపించాలని వారు అన్నారు..కాంగ్రెస్, బీజేపి పార్టీల చేతిలో నెత్తి లేదు, కత్తి లేదు బీజేపీ అన్ని అబద్దలతో అసత్య ఆరోపణలు చేస్తూ కార్లు వేసుకొని రయ్యిమని ఓట్లు దండుకోవడానికి వస్తున్నారు..వారికి మీ ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలి..
అర్హులైన అందరికీ న్యాయం రాష్ట్రంలో అత్యధికంగా డబల్ బెడ్రూం ఇండ్లు కట్టించిన ఘనత స్వర్గీయ రామలింగారెడ్డి గారిది అని గుర్తు చేశారు..
త్వరలోనే ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తాం…ప్రతి ఇంటికి త్రాగునిరు ఎలాగైతే ఇచ్చామో అలాగే ప్రతి గుంట భూమికి సాగునీరు ఇచ్చి తిరుతాం అని అన్నారు..
మహిళలకి నీళ్ల కష్టాలు బాగా ఉండేవి ..ఇప్పుడు కష్టాలు లేవు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునిరు సౌకర్యం కలిపించడం జరిగింది అన్నారు..ఈరోజు ప్రతి బిందెలో రామలింగారెడ్డి గారి మొఖం కనపడుతుంది అని అన్నారు..

వృద్దులకు ఆసరా , బీడీ కార్మికులకు , వితంతువులు, వికలాంగులకు, ఒంటరి మహిళలకి, వివిధ రకాలుగా వారికి పెన్షన్లు కలిపించన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కాదా అని వారు అన్నారు..ఇటువంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రంల్లో ఎక్కడ కూడా లేవు అని అన్నారు..రైతుబందు ద్వారా పెట్టుబడి సాయం కింద ఏడాదికి రెండుసార్లు 10000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు..ఈరోజు బీజేపొల్లు మోటారుకు మిటారు పెట్టుతారట.. బిల్లులు వసూలు చేయడానికి చట్టం తెచ్చారు అని అన్నారు..చిటికెడు పప్పు వేసి పప్పంతా నాదే అన్నట్టు బీజేపీ వ్యవహరిస్తోంది అని అన్నారు..ఉత్త మాటలు చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు .తర్వాత కనిపించారు మళ్ళీ..ని స్వంత నియోజకవర్గ పరిధిలో గెలువలేని నువ్వు ఇక్కడ ఏమి చేద్దాం అని వచ్చావు అని అన్నారు..

మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తూ రైతులకు మేలు చేస్తే బీజేపొల్లు రైతుల నడ్డి విరిచేందుకు చూస్తున్నారని అన్నారు..
Sc st లకు 101 యూనిట్ వరకు బిల్లు ఇవ్వకున్న ప్రభుత్వం భరిస్తుంది అని ఇప్పుడు బీజేపీ వాళ్ళు బలవంతంగా బిల్స్ వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.పేదింటి ఆడపిల్లల వివాహానికి లక్ష నూట పదహారు రూపాయల ఇవ్వడం జరుగుతుంది అని కాన్పు కోసం కేసీఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది అని కడుపు నిండా అన్నం పెడుతున్నారని ఆటో కిరాయు లేకుండా ఇంటి దగ్గర ధింపుతున్నాము అని అన్నారు..ఈరోజు రాయపోల్ ని మండల్ కేంద్రాన్ని చేసింది తెరాస ప్రభుత్వం అని బీజేపీ కాంగ్రెస్ కాదు అని ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కట్టించేది కూడా తెరాస ప్రభుత్వం అని అన్నారు..మరి ఇవన్నీ గా బీజేపొల్లు చేస్తారా చెయ్యరు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది తెరాస ప్రభుత్వం అని అన్నారు..అందుకే మీ అడబిడ్డగా సుజాతమ్మ గారు వచ్చారు ..మీరు అందరూ ఆ తల్లికి దీవెనలు ఇయ్యలని కోరుతున్నాను..బీజేపీ కాంగ్రెసు డిపాజిట్లు గల్లంతు చెయ్యాలని పిలుపునిచ్చారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat