తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తున్నది. చాదర్‌ఘాట్ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్, శంకర్ నగర్, కమల్‌నగర్ పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు మిద్దలపైకి చేరారు.
చాదర్‌ఘాట్ దగ్గర కొత్త వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌కు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
వరద ఉధృతిలో అంబర్‌పేట-దిల్‌సుఖ్‌నగర్ దారిలో మూసీనదిపై ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయింది. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఇటు వైపు రావొద్దని వాహనదారులకు పోలీసులు సూచించారు.
ముంపు ప్రాంతాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మేయర్ బొంతురామ్మోన్ పరిశీలించారు. ముసారాంబాగ్ బ్రిడ్జివద్ద పరిస్థితిని పర్వవేక్షించారు. స్థానికంగా ఉన్న ఇండ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు.