హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
-ఉప్పల్ – ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ – కోఠి రోడ్లు మూసివేత
-బేగంపేటలో రహదారిపై భారీగా వరద నీరు
-కాచిగూడ రైల్వేష్టేషన్‌లో పట్టాలపై నిలిచిన వర్షపు నీరు
-నిజాంపేటతో పాటు బండారి లేఅవుట్ జలమయం
– మెహిదీపట్నం – హైటెక్ సిటీ రహదారి జలమయం
-కూకట్‌పల్లి ఐడీపీఎల్, హాఫిజ్‌పేట చెరువులకు భారీ వరద
-హుస్సేన్ సాగర్ 4 గేట్లు ఓపెన్
-గచ్చిబౌలి నుంచి హెచ్‌సీయూ వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు
-బెంగళూరు – హైదరాబాద్, విజయవాడ హైవేలు మూసివేత