నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అభినందించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో గాయత్రి రవి కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా శాసనమండలి లో బలమైన నాయకురాలికి అవకాశం లభించిందని రవి అన్నారు.
