తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మంగళవారం అతిభారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయయ్యాయి. నాలాలు పొంగుతున్నాయి. మరో రెండు, మూడురోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలను కోరారు.
నగరంలో వరద పరిస్థితిపై అధికారులతో ఆయన ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అన్ని బృందాలను నిమగ్నం చేయాలని ఆదేశించారు.
అందుబాటులో విపత్తు నిర్వహణ సిబ్బంది..
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సేవలందించేందుకు జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్, విపత్తు నిర్వహణ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవలకోసం ప్రజలు 040-211111111 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
విపత్తు నిర్వహణశాఖ నంబర్ 9000113667, చెట్ల తొలగింపు సిబ్బంది నంబర్ 6309062583, విద్యుత్ శాఖ నంబర్ 9440813750, ఎన్డీఆర్‌ఎఫ్ నంబర్ 8333068536, డీఆర్‌ఎఫ్ నంబర్ 040-29555500, ఎంసీహెచ్ విపత్తు నిర్వహణశాఖ నంబర్ 9704601866లకు ఫోన్ చేయాలని కోరారు.