తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం ఈ రోజు మంగళవారం మొదలుకానున్నది. ఇటీవల ప్రారంభమైన శాసన సభ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే.
ఈ రోజు మొదలు కానున్న ఈ ప్రత్యేక సమావేశంలో జీహెచ్ఎంసీలో వార్డుల రిజర్వేషన్లకు రోటేషన్ లేకుండా ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించే విధంగా బిల్లును తీసుకురానున్నది.
నాలా చట్టం ,నేర విచారణ స్మృతి వంటి పలు ప్రత్యేక చట్టాలకు ప్ర్తభుత్వం పలు సవరణలను చేసింది. వీటిని అసెంబ్లీలో ఆమోదనంతరం పద్నాలుగో తారీఖున జరగబోయే శాసన మండలిలో కూడా ఈ బిల్లులను ఆమోదించనున్నారు.