అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో మమేకం కావాలని గ్రూప్-2 అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు.
సోమవా రం ఎంసీహెచ్చార్డీలో గ్రూప్-2 అధికారుల 40 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సేవకు గ్రూప్-2 ఉద్యోగం గొప్ప అవకాశమన్నారు.
కార్యక్రమంలో బీపీ ఆచార్యతోపాటు అదనపు డీజీ హరిప్రీత్‌సిం గ్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, శిక్షణ తరగతుల కో ఆర్డినేటర్లు నబీ, రాంగోపాల్, సౌమ్య రాణి, సుబ్బారావు పాల్గొన్నారు.
పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి
పెన్షనర్లు, అర్హులైన వారి కుటుంబసభ్యు లు పట్టభద్రుల ఓటరు జాబితాలో తమ పేర్ల ను నమోదుచేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశమయ్యారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కేంద్ర సంఘం అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి నవనీత్‌రావు, రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విశ్వాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.