తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు ఈ రోజు మంగళ వారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ.. 10 శాతం బడ్జెట్‌ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ.. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ తెచ్చమన్నారు..
జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్ రెండు పర్యాయాలు కొనసాగిస్తూ నాల్గవ చట్ట సవరణ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా ఐదవ చట్ట సవరణ చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.