ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు తెరాస సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. కవిత గెలుపు నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా మరింత దోహదం చేస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే ప్రజలకు, రైతులకు తప్పుడు హామీలతో బాండు పేపర్లు రాసిచ్చి మోసం చేసిన వ్యక్తిని గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి పొరపాటు చేశామని ఏడాదిలోపే జిల్లా ప్రజలు గ్రహించారని పేర్కొన్నారు.
అన్ని ఎన్నికల్లో విజయం సాధించినట్టే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిందని, ఇదే ఉత్సాహంతో వచ్చే నెలలో జరుగనున్న దుబ్బాక ఉపఎన్నికలో కూడా టీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని గుర్రాల నాగరాజు ధీమా వ్యక్తం చేశారు.