ఆరోగ్యశాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా మానవత్వంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు.
కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని మంత్రి తెలిపారు. కరోనా బాధితుల చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తే ప్రతిపక్ష నేతలు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారన్నారు.
ఆరోగ్యశ్రీ కింద వైద్యం నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు జేబుల నుంచి ఒక్క పైసా ఖర్చు చేయకుండా వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు